తెలంగాణ

telangana

ETV Bharat / state

కోడిపెట్ట... కౌజుపిట్ట... ఏది కావాలి? - engineering

వాళ్లింద్దరూ ఇంజినీర్లే... లక్షల్లో జీతాలు.. విలాసవంతమైన జీవితం. అవేవీ వాళ్లకు సంతృప్తినివ్వలేదు. అవన్నీ వదిలేసి వ్యవసాయం బాట పట్టారు. కాస్త వినూత్నంగా ఆలోచించి... నాటుకోళ్ల పెంపకంపై ఆసక్తి చూపారు. వివిధ జాతుల కోళ్ల మాంసాంతో పాటు మటన్, కుందేలు, కౌజు పిట్టల మాంసాన్ని విక్రయిస్తున్నారు.

కోడిపెట్ట... కౌజుపిట్ట... ఏది కావాలి?

By

Published : May 16, 2019, 12:42 PM IST

ఓ సాఫ్ట్​వేర్ కౌజు పిట్టలను పెంచుతున్నాడు. మరో ఇంజినీర్‌ కోళ్లను అమ్ముతున్నాడు. నిజమే.. ఒకరు బీటెక్.. ఇంకొకరు స్కాట్లాండ్​లో ఎంఎస్‌ చేశారు. వారి వారి రంగాల్లో స్థిరపడ్డారు. లక్షల్లో జీతాలు. విలాసవంతమైన జీవితం. ఏదో వెలితి. పెద్ద చదువులు చదివినా.. వ్యవసాయం అంటే మక్కువ. ఉద్యోగం వదిలి పల్లెబాట పట్టారు. మాంసాహారాన్నిచ్చే జాతుల పెంపకంతో పాటు.. మార్కెట్ నిర్వహణ చూసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

కోడిపెట్ట... కౌజుపిట్ట... ఏది కావాలి?

ఇదీచూడండి: ఆటిజం పిల్లలకు ఆమె అమ్మ

వినూత్నంగా ఆలోచించారు...

ఖమ్మం నగరానికి చెందిన నవీన్, శివారెడ్డి ఇద్దరు మిత్రులు. కొత్త కొత్త ఆలోచనలు... ఏదో చేయాలన్న తపన వీరిద్దరిది. కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ రంగాన్నే ఎంచుకున్నారు. కాస్త వినూత్నంగా ఆలోచించి వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారించారు. ఖమ్మం గ్రామీణ మండలం పల్లెగూడెంలో నాటుకోళ్ల పెంపకం పరిశీలించారు. ఓ వ్యక్తి దగ్గర 20 ఎకరాల భూమి లీజుకు తీసుకుని కార్యాచరణ మొదలుపెట్టారు.

వ్యవసాయ అనుబంధ రంగాల్లో తర్ఫీదు పొంది నాటుకోళ్లు, సీమకోళ్లు, కడక్ నాథ్ కోళ్లు, చీమకోళ్లు, కౌజు పిట్టలు, కుందేళ్లు, మేకపోతులు, గొర్రెపోతుల పెంపకాన్ని చేపట్టారు.

ఇదీ చూడండి: ఓ దుర్ఘటన.. వినూత్న ఆలోచన.. కలిస్తే విజయం

ప్రత్యేకంగా మార్కెట్‌...

వివిధ జాతుల కోళ్లను మాంసం కోసం పెంచడమే కాదు... వాటి జాతుల్ని మరింత వృద్ధి చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు. గుడ్లను పిల్లలుగా చేసే ప్రత్యేక యంత్రాన్ని కొనుగోలు చేసి... కోళ్లు గుడ్లు పెట్టిన తర్వాత వాటిని యంత్రం సాయంతో పిల్లలుగా చేస్తున్నారు.

పల్లెగూడెంలో మెగామీట్ పేరుతో ప్రత్యేకంగా మార్కెట్​ ఏర్పాటు చేశారు. వివిధ జాతుల కోళ్ల మాంసంతో పాటు మటన్, కుందేలు, కౌజు పిట్టల మాంసాన్ని విక్రయిస్తున్నారు.

సొంత వ్యాపారం ఎంతో సంతృప్తినిస్తోందని అంటున్నారీ ఖమ్మం యువకులు. రాష్ట్రస్థాయిలో వ్యాపార విస్తరణకు వ్యూహాలకు పదును పెడుతున్నారు.

ఇదీ చూడండి:అద్భుత కళాఖండాలు... సీసాల్లో చెక్క బొమ్మలు

ABOUT THE AUTHOR

...view details