సింగరేణి పంచాయతీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం - సింగరేణి సర్పంచ్ స్రవంతి బలవన్మరణం
10:20 August 01
సింగరేణి పంచాయతీ సర్పంచ్ స్రవంతి ఆత్మహత్యాయత్నం
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సింగరేణి పంచాయితీ సర్పంచ్ స్రవంతి ఉరివేసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి చేర్చారు. కొద్ది నెలల నుంచి పంచాయితీలో నిధుల దుర్వినియోగంపై చర్చ కొనసాగుతోంది. ఇటీవల మూడోసారి అధికారులు సైతం దీనిపై విచారణ చేయడం రాజకీయ అంశంగా మారి అన్యాయంగా తనపై వస్తోన్న విమర్శలకు తీవ్ర మనస్థాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
పంచాయతీలో రూ. 25 లక్షల నిధుల దుర్వినియోగంపై కొంత కాలంగా వివాదం జరుగుతున్న తరుణంలో సర్పంచి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఇదీ చదవండి:ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల