తమ భూములకు నష్టపరిహారం ఇవ్వలేదంటూ సింగరేణి నిర్వాసితులు ఖమ్మం ప్రజావాణి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. సత్తుపల్లి మండలం, కొంపల్లికి చెందిన 20 మంది నిర్వాసితులు పురుగుల మందు డబ్బాతో కార్యాలయానికొచ్చి తమ గోడు పట్టించుకోండని కన్నీటి పర్యంతమయ్యారు. న్యాయం కావాలంటూ నినదించారు. పోలీసులు వారిని సమావేశ మందిరంలోకి తీసుకెళ్లి కలెక్టర్ ఆర్వీకర్ణన్‌కు వినతి పత్రం ఇప్పించారు.
పురుగు మందు డబ్బాతో సింగరేణి నిర్వాసితుల ధర్నా - Singareni displaced peoples are protest at khammam collectrate
సింగరేణి భూ నిర్వాసితులు ఖమ్మం ప్రజావాణి వద్ద ఆందోళన నిర్వహించారు. సత్తుపల్లి మండలం కొంపల్లికి చెందిన నిర్వాసితులు తమ భూములకు నష్టపరిహారం చెల్లించలేదని నిరసన వ్యక్తం చేశారు.
![పురుగు మందు డబ్బాతో సింగరేణి నిర్వాసితుల ధర్నా Singareni displaced peoples are protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5248525-thumbnail-3x2-land-rk.jpg)
పురుగు మందు డబ్బాతో సింగరేణి నిర్వాసితుల ధర్నా
కొందరు దళారులతో చేతులు కలిపి అర్హులైన తమకు పరిహారం దక్కకుండా చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
పురుగు మందు డబ్బాతో సింగరేణి నిర్వాసితుల ధర్నా
ఇదీ చూడండి: 'ఆర్టీసీ ఛార్జీల పెంపులో రాజకీయం కోణం'