వైఎస్ షర్మిలకే తమ పూర్తి మద్దతు ఉంటుందని ఖమ్మం జిల్లా మధిర పురపాలక వైస్ ఛైర్పర్సన్ శీలం విద్యాలత, ఆమె భర్త శీలం వెంకట రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో అధికారికంగా షర్మిలమ్మ పార్టీలో చేరతామని స్పష్టం చేశారు. వారు హైదరాబాద్లోని లోటస్ పాండ్లో షర్మిలను ఇటీవల కలిసినట్లు వెల్లడించారు.
'షర్మిలమ్మకే మా మద్దతు... ఆమెతోనే ఉంటాం' - తెలంగాణ వార్తలు
షర్మిలమ్మకే తమ మద్దతు ఉంటుందని మధిర పురపాలక వైస్ ఛైర్పర్సన్ శీలం విద్యాలత, ఆమె భర్త శీలం వెంకట రెడ్డి ప్రకటించారు. ఖమ్మంలో జరగనున్న బహిరంగ సభలో అధికారికంగా చేరతామంటూ వెల్లడించారు. హైదరాబాద్లో ఆమెను ఇటీవల కలిసినట్లు తెలిపారు.
షర్మిలమ్మకే మా మద్దతు... ఆమెతోనే ఉంటాం: శీలం వెంకట రెడ్డి
స్థానిక తెరాస నాయకులు వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేయగా... షర్మిలను కలిసిన మరుసటి రోజు ఆ పార్టీలోనే కొనసాగుతామంటూ ప్రకటించారు. షర్మిల నేరుగా వారితో ఫోన్లో మాట్లాడగా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని భరత్ విద్యాసంస్థల అధినేత శీలం వెంకట రెడ్డి వెల్లడించారు.
ఇదీ చదవండి:న్యాయవాద దంపతుల హత్యకేసులో మరొకరు అరెస్ట్