ఖమ్మం జిల్లా వైరా మండలం కె.జి.సిరిపురం చౌకధరల దుకాణం నుంచి అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన 130 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఖమ్మం టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా బస్తాల్లో నిల్వ ఉంచి లోడింగ్ చేస్తుండగా... పోలీసులు పథకం ప్రకారం పట్టుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న 130 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత - khammam district news
చౌకధరల దుకాణం నుంచి అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన 130 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఖమ్మం టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అప్పగించారు.
అక్రమంగా తరలిస్తున్న 130 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
చౌకధరల దుకాణాల నుంచి అక్రమంగా బియ్యం దారి మళ్లిస్తున్నారనే సమాచారం మేరకు దాడిచేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. పేదలకు బియ్యం పంపిణీ చేయాల్సిన చౌకధరల దుకాణాల యజమానులు ఇలా చేయడం పట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న 130 క్వింటాళ్ల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అప్పగించారు.
ఇవీ చూడండి: ఏటీఎం దొంగ అరెస్ట్... సీసీ కెమెరాలే ప్రధాన ఆధారం