నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేటలోని రామగిరి క్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ వికారి నామ సంవత్సర మాఘ శుద్ధ త్రయోదశి సందర్భంగా సీతారాముల కల్యాణోత్సవాన్ని ఏటా ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని ఆలయ ఛైర్మన్ రామస్వామి తెలిపారు.
రామగిరిలో వైభవంగా సీతారాముల కల్యాణం - SEETHARAMULA KALYANAM IN RAMAGIRI
వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాద్యాల నడుమ సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. నాగర్కర్నూల్ జిల్లా రామగిరి క్షేత్రంలో మాఘ శుద్ధ త్రయోదశి సందర్భంగా జరిగిన ఈ వేడుకకు భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
SEETHARAMULA KALYANAM AT RAMAGIRY TEMPLE
రామగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణానికి భక్తులు పెద్దఎత్తున హాజరయ్యారు. వేడుకకు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జడ్పీటీసీ భరత్ ప్రసాద్, ఎంపీపీ సునీత తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:'ఐదుగురికి ఉరిశిక్ష వేయడం అభినందనీయం'