తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారంలో ముందంజలో తెలంగాణ' - తెలంగాణ కేసుల తాజా వార్తలు

ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారంలో దేశంలోనే తెలంగాణ ముందుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు.

రాష్ట్రంలో 8 వేల కేసులు పరిష్కరించాం: ఎర్రోళ్ల శ్రీనివాస్​
రాష్ట్రంలో 8 వేల కేసులు పరిష్కరించాం: ఎర్రోళ్ల శ్రీనివాస్​

By

Published : Nov 19, 2020, 7:32 PM IST

ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు రాష్ట్రంలో మొత్తం 10 వేల కేసుల్లో 8 వేల కేసులను పరిష్కరించామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తెలిపారు. గురువారం ఖమ్మం టీటీడీసీ భవనంలో జన అదాలత్‌ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. పలు కేసులపై సమీక్ష నిర్వహించారు.

కేసులు పరిష్కరించటమే కాకుండా ఇప్పటి వరకు రూ. 55 కోట్ల 60 లక్షలు నష్టపరిహారం బాధితులకు అందజేసిన ఘనత దేశంలోనే మనకు దక్కుతుందని ఎర్రోళ్ల శ్రీనివాస్​ వెల్లడించారు.

ఇదీ చదవండి:హైదరాబాద్​లో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర.. సహించం: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details