కరోనా వైరస్ బారిన పడటానికి ఎవ్వరూ అతీతులు కారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హెచ్చరించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే... మర్లపాడులో రూ.76 లక్షలతో నిర్మించనున్న రహదారికి శంకుస్థాపన చేశారు.
కరోనా కమ్ముకొస్తోంది.. వ్యక్తిగత జాగ్రత్త తప్పనిసరి: ఎమ్మెల్యే సండ్ర - corona cases in telangana
ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పర్యటించారు. పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే... కల్లూరులో ఏర్పాటు చేసిన ఎంపీడీవో అభినందన సభకు హాజరయ్యారు. కరోనా విజృంభిస్తున్న వేళ అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
కల్లూరులో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న ఎంపీడీవో నర్మదకు ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. బాధ్యతగల అధికారిణిగా ఎంపీడీవో నర్మద సేవలందించారని ఎమ్మెల్యే కొనియాడారు. ఎంపీడీవో నర్మదను ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
కరోనా వైరస్ ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చిందని, ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణతో మెలగాలని సూచించారు. వచ్చే రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అమెరికాలో కన్నా ఎక్కువగా భారత్లోనే కొవిడ్ కేసులు, మరణాలు ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిందని గుర్తు చేశారు.
ఇవీ చదవండి:పూర్తి వేతనాల చెల్లింపునకు సర్కారు ఉత్తర్వులు జారీ
TAGGED:
corona cases in telangana