తెలంగాణ

telangana

ETV Bharat / state

హరితవనాలు పెంచాలి:సత్తుపల్లి ఎమ్మెల్యే - Khammam news

హరితహారం పథకం ద్వారా గ్రామాల్లో మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని సత్తుపల్లి ఎమ్మెల్యే కోరారు. కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్​తో కలిసి తల్లాడ మండలం అన్నారుగూడెం ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ముఖద్వారంను ప్రారంభించారు.

Sattupalli MLA asked to increase the greenery of plants in the villages through the Haritha haram scheme.
హరితవనాలు పెంచాలి:సత్తుపల్లి ఎమ్మెల్యే

By

Published : Jan 6, 2021, 9:49 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం ద్వారా గ్రామాల్లో మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫాఠశాల ముఖద్వారంను కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్​తో కలిసి ఆయన ప్రారంభించారు.

అభినందించారు

హరితహారంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. గ్రామాల్లో ఖాళీ స్థలాలతో పాటు .. పాఠశాల ఆవరణలో హరితవనాలు పెంచాలని ఎమ్మెల్యే సండ్ర సూచించారు. పాఠశాల ఉపాధ్యాయుడు మాదినేని నరసింహారావు సహకారంతో మొక్కలునాటడం.. వాటికి ఏటా పుట్టినరోజు నిర్వహించడం వంటి విషయాలు తెలుసుకుని అభినందించారు.

ఉపాధ్యాయుడి స్పూర్తితో..

రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించిన ఆ ఉపాధ్యాయుడి స్పూర్తితో ప్రతి ఒక్కరూ అభివృద్ధికి తోడ్పడాలని.. మొక్కల పెంపకంతోపాటు వాటిని రక్షించడంలో అక్కడి ఉపాధ్యాయుల పాత్రను కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్ ప్రశంసించారు. ఈ కార్యక్రంమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు , జెడ్పీటీసీ దిరిశాల ప్రమీల, సొసైటీ ఛైర్మన్ గడ్డం వీరమోహన్‌రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి ప్రమాణం రేపే..!

ABOUT THE AUTHOR

...view details