నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్న అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపంతో ఖమ్మం జిల్లాలో సాగర్ నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సాగర్ ఆయకట్టు రైతులతో కలిసి కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌కు వినతి పత్రం సమర్పించారు.
నీటి సరఫరాలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు: సండ్ర - telangana varthalu
ఖమ్మం జిల్లాలో సాగర్ నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపంతోనే ఇలా జరుగుతున్నట్లు వెల్లడించారు. పంటలు ఎండిపోకుండా కాపాడాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
నీటి సరఫరాలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు: సండ్ర
ఈ సందర్భంగా కలెక్టర్ సమక్షంలో ఎన్ఎస్పీ ఎస్ఈ, ఇరిగేషన్ సీఈలతో సమీక్ష నిర్వహించారు. నీటి సరఫరాలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు సమన్వయం చేసుకొని పంటలు ఎండిపోకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:ప్రైవేటు సంస్థలకు దీటుగా విజయ డైరీని నడిపిస్తున్నాం: తలసాని