ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని పదో తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యసూచించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో వీడ్కోలు సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 10 జీపీఏ సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా సన్మానించనున్నట్లు తెలిపారు.
'ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు పొందాలి' - ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల
సత్తుపల్లి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరయ్యారు. ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలతో పాఠశాలకు పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.

'ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు పొందాలి'
నియోజకవర్గంలోని 44 పాఠశాల పదో తరగతి విద్యార్థులకు అల్పహారం కోసం దాతల సహకారంతో ఎనిమిదిన్నర లక్షల రూపాయలు ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఎన్సీసీ విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కల్లూరు ఏసీపీ వెంకటేష్, మున్సిపల్ ఛైర్పర్సన్ కూసంపూడి మహేష్, కమిషనర్ సుజాత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
'ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు పొందాలి'