ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పర్యటించారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందించారు. 88 మందికి కల్యాణ లక్ష్మీ చెక్కులను, 38 మందికి షాదీ ముబారక్ చెక్కులను అందించినట్లు పేర్కొన్నారు.
'లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వడం మానసిక సంతృప్తి ఇస్తుంది'
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందించారు. ఈ కార్యక్రమం మానసిక సంతృప్తిని ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
'లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వడం మానసిక సంతృప్తి ఇస్తుంది'
ఇంటింటికి తిరిగి చెక్కులు అందిస్తున్నామని... ఈ కార్యక్రమం మానసిక సంతృప్తిని ఇస్తుందని వెంకటవీరయ్య తెలిపారు. ఆడపిల్లలకు పెళ్లిచేయడం తల్లిదండ్రులకు ఇబ్బంది కాకూడదనే ఈ పథకాలను కేసీఆర్ ప్రవేశ పెట్టారని వెల్లడించారు. ఎంపీపీ రఘ, డీసీసీబీ డైరక్టర్ లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.