అన్ని రంగాల్లో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు.
'సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోంది' - తల్లాడ మండలంలో చెక్కుల పంపిణీ
ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పర్యటించారు. ముఖ్యమంత్రి సహాయనిధి, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను 72 మంది లబ్ధిదారులకు ఇంటింటికీ తిరిగి అందజేశారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, తల్లాడ మండలం
72 మంది లబ్ధిదారులకు రూ.39 లక్షల విలువ గల చెక్కులు అందజేశారు. సంక్షేమ పథకాలు పేద ప్రజలందరికీ అందేవిధంగా కృషి చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల శేషగిరిరావు, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, తెరాస పార్టీ తల్లాడ మండల అధ్యక్షుడు రెడం వీర మోహన్ రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:రుయ్యాడి ఒడిలో కేంద్ర పురస్కారం.. సాధ్యమైందిలా..!