Sathupalli Constituency Fully Dalit Bandhu Scheme Implementation : ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా.. ఖమ్మం, స్తతుపల్లి నియోజకవర్గాల్లో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఖమ్మంలో రూ.1390 కోట్లు, సత్తుపల్లిలో రూ.142 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా రెండుచోట్లా ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన బహిరంగసభల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి మూడు కమాండ్లు ఉన్నాయని చెప్పారు.
హైదరాబాద్‌లో లోకల్ కమాండ్.. బెంగళూరులో న్యూకమాండ్.. దిల్లీలో హైకమాండ్ అని కేటీఆర్ (KTR) విమర్శించారు. ఒకరి మాట ఒకరు వినరని.. ఒకరు ఇచ్చిన హామీకి ఇంకొకరికి నెరవేర్చరని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి కప్పల తక్కెడ లాంటిందని.. ఒకరు పైకివస్తుంటే నలుగురు కిందికి లాగుతారని అన్నారు. హస్తం పార్టీ ఉమ్మడి రాష్ట్రాన్ని 11 సార్లు పాలించిందని గుర్తు చేశారు. ఆరు దశాబ్దాల పాటు అధికారాన్ని అనుభవించిన పార్టీ.. వారు చేసిన మోసాలు, దగా ప్రజలు మరిచిపోలేదని కేటీఆర్ వివరించారు.
KTR Speech in Wanaparthy Ten Years Progress : 'తెలంగాణ రాష్ట్రం అంటే ప్రధానికి ఎందుకంత కక్ష?'
KTR on Congress Six Guarantees :ఆరు దశాబ్దాలపాటు ఏమీ చేయని అసమర్థులు.. ఇప్పుడు 6 గ్యారెంటీలంటూ కొత్త వేషాలతో ప్రజల ముందుకొస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో.. ఈ హామీలు అమలు చేస్తున్నారా చెప్పాలని డిమాండ్ చేశారు. గ్యారెంటీలని ఊదరగొడుతున్న హస్తం నాయకులకు.. అసలు వాళ్ల సీట్లకే గ్యారెంటీ లేదని ఎద్దేవా చేశారు. 24 గంటల కరెంటు ఎక్కడ ఇస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ఒకరు ప్రశ్నించారని.. కేటీఆర్ పేర్కొన్నారు
ఇచ్చినట్లు చూపిస్తే రాజీనామా చేస్తానని కాంగ్రెస్ ఎంపీ ప్రకటించారని కేటీఆర్ అన్నారు. ఆయనకు అనుమానం ఉంటే.. ఖమ్మం జిల్లాలోని ఏ నియోజకవర్గానికైనా రావాలని.. సమయం, తేదీ చెప్పి జిల్లాలో ఏ మండలం, ఏ గ్రామం వస్తారో చెప్పాలని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడికి వస్తారని.. అక్కడ కరెంట్ తీగలు పట్టుకుంటే.. విద్యుత్ సరఫరా ఉందో లేదో తెలుస్తుందని చెప్పారు. కర్ణాటక కాంగ్రెస్ నుంచి.. తెలంగాణ హస్తం పార్టీకి వందల కోట్లు వస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు.
Minister KTR Fires on Governor Tamilisai : 'గవర్నర్ మనసుతో ఆలోచించి ఉంటే.. తిరస్కరించేవారు కాదు'
KTR Fires on Congress : కర్ణాటకలో కొత్త భవనాలు నిర్మిస్తే ప్రత్యేకంగా చదరపు గజానికి రూ.500 ముక్కు పిండి వసూలు చేసిన సొమ్మును.. అక్కడి నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పంపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆ రాష్ట్రం నుంచి వందల కోట్లు తెచ్చి.. ఇక్కడి ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వందల కోట్లు ఖర్చు చేసినా అమ్ముడు పోయే అంగడిసరుకు తెలంగాణ కాదని తెలిసే విధంగా.. బెంగళూరు, దిల్లీ వాళ్లకు ప్రజలు సమాధానం చెప్పాలని అన్నారు. హస్తం పార్టీ దొంగ సొమ్ము తీసుకుని.. ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేయాలని సూచించారు. ప్రగతి రథ చక్రాలు మందుకు వెళ్లాలంటే భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉండాలని కేటీఆర్ కోరారు.
KTR Khammam District Tour : ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్ సమీపంలో ఎన్టీఆర్ పార్కు, ఎన్టీఆర్ విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా.. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి నందమూరి తారక రామారావు ఆరాధ్య దైవమని కొనియాడారు. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కేటీఆర్ వెల్లడించారు.