తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిబంధనలు అతిక్రమిస్తే.. చర్యలు తప్పవు'

ఖమ్మం జిల్లా ఏన్కూరు పోలీస్​స్టేషన్​ వద్ద సహకార ఎన్నికల నియమావళిపై అఖిలపక్షాల నాయకులు, అభ్యర్థులతో కలిసి సత్తుపల్లి ఏసీపీ వెంకటేశ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని సూచించారు.

By

Published : Feb 13, 2020, 7:54 PM IST

sathhupalli-acp-meeting-with-all-party-leaders-in-khammam-district
'నిబంధనలు అతిక్రమిస్తే.. చర్యలు తప్పవు'

ఖమ్మం జిల్లాలో సహకార ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని సత్తుపల్లి ఏసీపీ వెంకటేశ్​ పేర్కొన్నారు. ఏన్కూరు పోలీస్​స్టేషన్​ వద్ద ఎన్నికల నియమావళిపై అఖిలపక్షాల నాయకులు, అభ్యర్థులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు.

ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గెలుపు, ఓటములు సహజమన్నారు. ఎన్నికల అనంతరం మనస్పర్ధలకు పోకుండా ఇరువర్గాలు.. అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఎన్నికల రోజున పోలీంగ్​ కేంద్రాల వద్ద నిబంధనలు పాటించాలని సూచించారు. 100 మీటర్ల లోపల ప్రచారం చేసినా... గుర్తులు చూపిస్తూ.. అతిక్రమించినా.. వారి సభ్యత్వం కూడా రద్దు చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

'నిబంధనలు అతిక్రమిస్తే.. చర్యలు తప్పవు'

ఇదీ చదవండి : దినదినగండం.. మృత్యువుతో పోరాటం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details