తెలంగాణ

telangana

ETV Bharat / state

'62 మందికి పోలీసు ఉద్యోగాలు రావడం అభినందనీయం' - '62 మందికి పోలీసు ఉద్యోగాలు రావడం అభినందనీయం'

ఖమ్మం జిల్లాలో మొత్తం 62 మంది విద్యార్థులు పోలీస్ సబ్ ఇన్స్​పెక్టర్, కానిస్టేబుల్ ఫలితాల్లో అర్హత సాధించారు. వీరందరికీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సన్మానం చేశారు.

'62 మందికి పోలీసు ఉద్యోగాలు రావడం అభినందనీయం'

By

Published : Oct 1, 2019, 5:21 PM IST

ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఫలితాల్లో అర్హత సాధించిన 62 మంది యువకులను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ప్రముఖ వ్యాపార వేత్త వద్దిరాజు రవిచంద్ర సన్మానం చేశారు. మల్లవరం గ్రామంలో 17 మంది కానిస్టేబుళ్లుగా ఎంపికవడంపై ఆనందం వ్యక్తం చేశారు. వివిధ గ్రామాల్లో అర్హత సాధించిన ఏడుగురు ఎస్సై, 48 మంది కానిస్టేబుల్ అభ్యర్థులను సత్కరించారు. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా తల్లాడ మండలంలో అర్హత సాధించడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే సండ్ర తెలిపారు. గతంలోనూ మల్లవరంలో 80 మంది వరకు కానిస్టేబుల్, ఇతర ఉద్యోగాల్లో స్థిరపడటం ప్రశంసనీయమన్నారు. సీనియర్లను చూసి స్ఫూర్తి పొంది మరింత మంది యువకులు ఉద్యోగాలు సాధించడం ఆదర్శనీయమన్నారు. రానున్న రోజుల్లో విద్యార్థులు మరిన్ని ఉద్యోగాలు సాధించాలని అతిథులు ఆశాభావం వ్యక్తం చేశారు.

'62 మందికి పోలీసు ఉద్యోగాలు రావడం అభినందనీయం'

ABOUT THE AUTHOR

...view details