తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ సమ్మెకు పారిశుద్ధ్య కార్మికులు మద్దతు - Sanitation workers support TSRTC strike IN TELANGANA

ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికై రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిదో రోజు సమ్మె కొనసాగుతోంది. ఖమ్మంలో వీరికి పారిశుద్ధ్య కార్మికులు మద్దతును ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి డిపో గేటు ఎదుట ధర్నా నిర్వహించారు.

ఆర్టీసీ సమ్మెకు పారిశుధ్ద్య కార్మికులు మద్దతు

By

Published : Oct 12, 2019, 10:57 AM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఈరోజు ఖమ్మంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ర్యాలీగా డిపో వరకు చేరుకున్నారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి డిపో గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. కార్మిక సంఘాలు సీఐటీయూ, ఇఫ్టూ, ఏఐటీయుసీ, ఐఎన్‌టీయుసీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ప్రవర్తిస్తుందని అసహనం వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులను కాలరాసే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

ఆర్టీసీ సమ్మెకు పారిశుద్ధ్య కార్మికులు మద్దతు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details