ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కొర్లగూడం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా కీసర వెంకటేశ్వర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. రైతుకు మేలు చేసే విధంగా సొసైటీ పాలకవర్గాలు పనిచేయాలని ఎమ్మెల్యే అన్నారు. రైతులు పెట్టుబడికి ప్రైవేటు వ్యక్తుల బారిన పడకుండా రుణాలు అందించాలని సూచించారు.
రైతుకు మేలు చేసేలా పనిచేయాలి: సండ్ర - కొర్లగూడం సొసైటీ పాలకవర్గం ప్రమాణస్వీకారం
రైతుకు మేలు చేసే విధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పనిచేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కొర్లగూడం సొసైటీ పాలకవర్గం ప్రమాణస్వీకారానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
రైతుకు మేలు చేసేలా పనిచేయాలి
గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ చేసుకునే విధంగా గోదాములు నిర్మించాలని మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతుల ప్రేమాభిమానాలు పొందేలా పాలకవర్గం పనితీరు ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ బోలు లక్ష్మణరావు, ఎంపీపీ బీరవల్లి రఘు, తెరాస జిల్లా నాయకులు మట్టా దయానంద్ రెడ్డి, మండల అధ్యక్షుడు పాలక రామారావు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇవే..