తెలంగాణ

telangana

ETV Bharat / state

తల్లాడలో ప్లాస్టిక్ నిర్మూలనపై భారీ ప్రదర్శన - ryali on plastic awareness

జిల్లా న్యాయసంస్థ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలనపై ఖమ్మం జిల్లా తల్లాడలో భారీ ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు, అధికారులు మానవహారంగా ఏర్పడి ప్రజలకు అవగాహన కల్పించారు.

తల్లాడలో ప్లాస్టిక్ నిర్మూలనపై భారీ ప్రదర్శన

By

Published : Nov 16, 2019, 12:32 PM IST

ఖమ్మం జిల్లా తల్లాడలో జిల్లా న్యాయసంస్థ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలనపై భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ హనుమంతు, శిక్షణ కలెక్టర్ ఆదర్శ్​తో పాటు మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. 'పర్యావరణాన్ని కాపాడాలి... ప్లాస్టిక్ నిర్మూలించాలి' అంటూ ఖమ్మం-రాజమండ్రి జాతీయ రహదారిపై ప్రదర్శన చేశారు. రింగ్​రోడ్డు కూడలిలో మానవహారంగా ఏర్పడి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ నిర్మూలనను ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులు సూచించారు.

తల్లాడలో ప్లాస్టిక్ నిర్మూలనపై భారీ ప్రదర్శన

ABOUT THE AUTHOR

...view details