తెలంగాణ

telangana

ETV Bharat / state

కష్టకాలంలోనూ రైతులకు భరోసాగా నిలిచాం:  ఎమ్మెల్యే సండ్ర - latest news of khammam

కరోనా కష్టకాలంలోనూ రైతులకు తెరాస ప్రభుత్వం అండగా నిలిచిందని.. ఎల్లప్పుడూ తాము రైతుల శ్రేయస్సే కోరుకుంటామని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడలో రైతులకు మంజూరైన రుణసాయం చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

runasayam cheques distributed to tallada farmers by mla sandra venkata veeraiah
కష్టకాలంలోనూ రైతులకు భరోసాగా రుణసాయం ఎమ్మెల్యే సండ్ర

By

Published : Jun 30, 2020, 12:25 PM IST

ఖమ్మం జిల్లా తల్లాడ సహకార బ్యాంకు వద్ద రైతులకు మంజూరైన రుణసాయం చెక్కులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పంపిణీ చేశారు. రైతుబంధుతోపాటు అనేక పథకాలను ప్రవేశపెట్టామని చెప్పారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ నష్టాల్లో ఉన్నా రైతాంగానికి ఎలాంటి లోటు లేకుండా అన్నీ సమకూర్చుతున్నారని తెలిపారు.

లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్రంలో ఎక్కువగా సత్తుపల్లి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు చేశామని, ప్రస్తుతం నియోజకవర్గంలోనే రైతులకు సిమెంట్‌ కల్లాలు మంజూరయ్యాయన్నారు. ప్రభుత్వం అందించిన సహకారంతో పంటల సాగు చేపట్టి అధిక దిగుబడులు సాధించాలన్నారు.

ఇదీ చూడండి:యాదాద్రి ఆలయ పనుల పరిశీలన.. పురోగతిపై ఆరా

ABOUT THE AUTHOR

...view details