తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి ఖమ్మంలో  14వ రోజు ఆర్టీసీ సమ్మె

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా సాగుతోంది. 14వ రోజు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కార్మికులకు మద్దతుగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ఆందోళనలతో ఆర్టీసీ డిపో, బస్టాండ్ ప్రాంగణాలు హోరెత్తాయి.

14వ రోజు ఆర్టీసీ సమ్మె

By

Published : Oct 18, 2019, 8:00 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఉమ్మండి ఖమ్మంలో జిల్లాలో కార్మికులకు మద్దతుగా పలు మహిళా సంఘాలు, అంగన్​వాడీ కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు డిపోల ఎదుట ఆందోళన నిర్వహించాయి. ఖమ్మంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీఎన్జీవో సంఘం నాయకులు కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. బస్ డిపో మేనేజర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఆందోళనలో సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు. రేపటి బంద్​ విజయవంతం చేయాలని కోరారు. కనీసం కార్మికులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం బాధకరమన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. రేపటి బంద్​తో ప్రభుత్వం దిగిరావాలన్నారు.

ఉమ్మడి ఖమ్మంలో 14వ రోజు ఆర్టీసీ సమ్మె

ABOUT THE AUTHOR

...view details