తెలంగాణ

telangana

ETV Bharat / state

తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లాడు... సొత్తు అంతా కాజేశాడు - వైరా వార్తలు

ఓ దుండగుడు బంగారు షాపు తాళాలు పగులగొట్టి... లోనున్న బంగారం, వెండి వస్తువులను తనతో పాటు తెచ్చుకున్న బస్తాలో వేసుకుని... దర్జాగా దోచుకుపోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరాలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

robbery-in-gold-shop-at-wyra-in-khammam-district
తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లాడు... సొత్తు అంతా కాజేశాడు

By

Published : Aug 27, 2020, 1:22 PM IST

ఖమ్మం జిల్లా వైరాలో వెండి, బంగారం దుకాణంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడి... దొంగతనానికి పాల్పడ్డాడు. పాత బస్టాండ్ సమీపంలో ఉన్న బాలాజీ దుకాణాన్ని తెరిచేందుకు ఉదయాన్నే యజమాని వచ్చాడు. తాళాలు తీసి ఉండటంతో ఖంగు తిన్న అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లాడు... సొత్తు అంతా కాజేశాడు

వైరా ఏసీపీ సత్యనారాయణ, సీఐ వసంత్ కుమార్, ఎస్సై సురేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. చోరీ జరిగినట్లు గుర్తించి క్లూస్ టీం వేలిముద్రలు సేకరించారు. సీసీ ఫుటేజ్ పరిశీలించగా ఓ వ్యక్తి తాళాలు పగులగొట్టి... దుకాణంలోకి చొరబడ్డాడు. తనతో తెచ్చుకున్న బస్తాలో షాపులోని బంగారు, వెండి సామాగ్రిని తీసుకుని వెళ్లిన దృశ్యాలు నమోదయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:కరోనా లింగ భేదం గుట్టు వీడిందోచ్‌!

ABOUT THE AUTHOR

...view details