తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసు బందోబస్తు నడుమ రోడ్డు సర్వే - Khhammam News

ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో గ్రీన్​ఫీల్డ్​ రహదారి నిర్మాణానికి భారీ బందోబస్తు నడుమ అధికారులు సర్వే చేపట్టారు. రహదారి వెళ్లే గ్రామాల ప్రజలు అడ్డుకోవడం వల్ల పోలీసుల బందోబస్తుతో సర్వే నిర్వహించాల్సి వచ్చిందని ఆర్డీవో సూర్యనారాయణ తెలిపారు.

Breaking News

By

Published : Jun 30, 2020, 9:08 PM IST

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామానుజవరం, లక్ష్మీపురం గ్రామాల సమీపంలో గ్రీన్​ఫీల్డ్​ రహదారి నిర్మాణం కోసం అధికారులు పలుసార్లు సర్వే నిర్వహించడానికి ప్రయత్నించారు. కానీ.. రెండు గ్రామాల ప్రజలు అధికారులను అడ్డుకొని సర్వే జరగనివ్వలేదు.

ఈ నేపథ్యంలో కల్లూరు, వైరా పోలీస్​ స్టేషన్ల ఏసీపీలు వెంకటేష్​, సత్యనారాయణల ఆధ్వర్యంలో సీఐ, ఎస్సైలు, 50 మంది పోలీసు సిబ్బందితో రహదారి సర్వే చేపట్టారు. ఆర్డీవో సూర్య నారాయణ పర్యవేక్షణలో అధికారులు సర్వే పూర్తి చేశారు. సర్వే విజయవంతం అయితే.. ప్రభుత్వం రైతులకు తగినంత పరిహారం ప్రకటిస్తారని, రైతులు, గ్రామస్థులు సహకరించాలని ఆర్డీవో కోరారు.

ఇదీ చూడండి:యాదాద్రి ఆలయ పనుల పరిశీలన.. పురోగతిపై ఆరా

ABOUT THE AUTHOR

...view details