ఖమ్మం నగర శివారు 7వ డివిజన్‌కు చెందిన రుద్రమకోట, పుట్టకోట ప్రాంతాలకు వెళ్లే రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రంగా దెబ్బతింది. పెద్దపెద్ద గోతులు పడి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. సమస్యను పరిష్కరించమంటూ స్థానికులు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు. వారెవరూ ముందుకు రాకపోవడం వల్ల సమస్య అంతే ఉంది.
ఆదర్శం: ఒక్కటిగా నడుం బిగించి.. సమస్య పరిష్కరించి - ఖమ్మం రోడ్డు మరమ్మతు పనులు చేసిన యువత
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఖమ్మం జిల్లా ఏడోవార్డు యువకులు వారి ప్రాంత సమస్యను వారే పరిష్కరించుకున్నారు. శ్రమదానం చేసి గోతులు పడ్డ రహదారికి మరమ్మతులు చేశారు.
![ఆదర్శం: ఒక్కటిగా నడుం బిగించి.. సమస్య పరిష్కరించి Road repair works done by Khammam youth](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9045005-622-9045005-1601802028834.jpg)
ఆదర్శం: ఒక్కటిగా నడుం బిగించి.. సమస్య పరిష్కరించి
దానితో రాకపోకలకు ఇబ్బందులెదర్కున్న యువకులు స్థానికులు తమ సమస్యను తామే పరిష్కరించాలనుకుని నడుంబిగించారు. పార పలుగు చేతబట్టి రోడ్డును బాగు చేసేందుకు ముందుకు వచ్చారు. సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వరకు రహదారిపై ఏర్పడిన గుంతలను మరమ్మతులు చేసి సాఫీగా చేశారు.
ఇదీ చూడండి:బోరబండ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూ'ప్రకంపనలు'