ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరు వాగు పైవంతెన సమీపాన ఉన్న రహదారి.. వరద ఉద్ధృతికి కోతకు గురైంది. మాటూరు నుంచి ఆంధ్రప్రదేశ్లోని గంపలగూడెం మండలంలోని పలు గ్రామాలకు నిత్యం వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. రహదారి కోతకు గురవడం వల్ల ఇప్పుడు రాకపోకలు నిలిచిపోయాయి.
మాటూరు వాగు సమీపాన కోతకు గురైన రహదారి.. రాకపోకలకు అంతరాయం - heavy rain in khammam
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరు వాగు సమీపాన ఉన్న రహదారి కోతకు గురైంది. ఫలితంగాఈ మార్గం నుంచి ఏపీలోని గంపలగూడెంకు రాకపోకలు నిలిచిపోయాయి.

మాటూరు వాగు సమీపాన కోతకు గురైన రహదారి
కోతకు గురైన రహదారి వద్ద తరచూ ప్రమాదాలు జరిగేవని స్థానికులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేయించాలని కోరారు.