రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు - road accident in khammam district latest news
![రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు road accident in khammam district latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5714876-73-5714876-1579062179113.jpg)
07:30 January 15
పండుగ రోజే ప్రమాదం.. తాతామనుమళ్ల మృతి..
సంక్రాంతి పండుగ రోజే... తాత మనుమళ్లు రోడ్డు ప్రమాదంలో చనిపోయి ఆ కుటుంబానికి తీరం శోకాన్ని మిగిల్చారు. మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయైన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. రాజమండ్రికి చెందిన సూరెడ్డి.. అతని ఇద్దరు కొడుకులూ, కోడళ్లు, మనవళ్లతో కలిసి కర్ణాటక వెళ్లారు. తిరిగి వస్తుండగా... పెనుబల్లి మండలం లంకపల్లి వద్ద ఈ రోజు తెల్లవారుజామున కారు అదుపుతప్పి రొడ్డు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సూరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా... ఆయన మనుమడు హేమంత్ రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కారులో ఉన్న మోహన్ కృష్ణారెడ్డి, సౌజన్య, సుబ్బారెడ్డి, భాగ్య లక్ష్మీ, రోహిత్ విజయసింహారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో ప్రస్తుతం వీరు ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సూరెడ్డి పెద్దకొడుకు సుబ్బారెడ్డి నిద్రమత్తులో ఉండి డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి: 'అవసరమైతే అధికారం కోల్పోవడానికైనా సిద్ధం'