ఖమ్మం జిల్లాలోని ఆర్ఎంపీ వైద్యులు తమ క్లినిక్లు వెంటనే బంద్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో రెవెన్యూ, వైద్య, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కలిసి ఆర్ఎంపీ వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
క్లినిక్లు బంద్ చేయాలని.. ఆర్ఎంపీలకు కలెక్టర్ ఆదేశాలు! - ఖమ్మం జిల్లా కలెక్టర్
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్ఎంపీ వైద్యులు తమ క్లినిక్లు బంద్ చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా తల్లాడలో రెవెన్యూ, వైద్య, పంచాయతీరాజ్ శాఖల అధికారులు ఆర్ఎంపీ వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కరోనా విస్తారంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా క్లినిక్లలో వైద్యం చేయడానికి వీలు లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సేవలకు మాత్రమే వైద్యం చేయాలని, ప్రమాద బాధితులకు ప్రథమ చికిత్స చేయడానికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. మండల పరిధిలోని ఆర్ఎంపీ వైద్యులంతా తప్పనిసరిగా పాలనాధికారి ఆదేశాలను పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ శ్రీలత తెలిపారు. రక్త పరీక్షా కేంద్రాలకు సైతం ఈ ఆదేశాలు వర్తిస్తాయని జిల్లా వైద్యాధికారి నవ్యకాంత్ తెలిపారు.
ఇదీ చూడండి :రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్