తెలంగాణ

telangana

ETV Bharat / state

పాఠాలు వల్లించే అధికారులే తప్ప తాగుతున్నారు! - revenue-officers-caught-while-drinking-alcohol

'కరోనా వ్యాప్తి అరికట్టేందుకు ప్రజలెవరూ బయటకు రాకండి' అని పగటిపూట ప్రజలకు పాఠాలు చెబుతారు. కట్​ చేస్తే రాత్రికి వారంతా ఒకేచోట కలిసి మద్యం సేవిస్తారు. అలా మద్యం మత్తులో అధికారులు విందులు చేసుకుంటున్న ఘటన ఖమ్మం జిల్లా మధిరలో చోటుచేసుకుంది.

revenue-officers-caught-while-drinking-alcohol
పాఠాలు వల్లించే అధికారులే పట్టాలు తప్పుతున్నారు!

By

Published : Apr 14, 2020, 1:25 AM IST

Updated : Apr 14, 2020, 6:52 AM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో సామాన్యుడికి మద్యం దొరక్కపోయినా.. అధికారులకు మాత్రం ఖరీదైన మందు బాటిళ్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ఖమ్మం జిల్లా మధిర రెవెన్యూ గెస్ట్​హౌస్​లో తహసీల్దార్ సైదులు, ఈవో పీఆర్డీ రాజారావు, వీఆర్​ఏ గంటా శ్రీను మద్యం సేవిస్తూ కింది స్థాయి ఉద్యోగులను బయట కాపలా ఉంచారు.

భౌతిక దూరం పాటించాలని, ఇళ్లలోంచి బయటకు రావద్దని మాటలు వల్లించే బాధ్యత కలిగిన అధికారులే మద్యం సేవిస్తుండటం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై తహసీల్దార్​ను వివరణ కోరగా.. విధులు నిర్వర్తించిన తర్వాత విశ్రాంతి భవనంలో సేద తీరుతున్నామని.. మందు పార్టీ చేసుకోవట్లేదని తెలిపారు.

పాఠాలు వల్లించే అధికారులే పట్టాలు తప్పుతున్నారు!
Last Updated : Apr 14, 2020, 6:52 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details