తెలంగాణ

telangana

ETV Bharat / state

రెవెన్యూ శాఖకు అస్తిత్వం లేకుండా చేస్తారా? - round table meeting

ప్రభుత్వం రెవెన్యూ శాఖకు అస్తిత్వం లేకుండా చేయాలనుకుంటోందని మండిపడ్డారు ఆశాఖ ఉద్యోగులు.

రౌండ్‌ టేబుల్‌ సమావేశం

By

Published : Apr 18, 2019, 7:48 PM IST

రెవెన్యూ శాఖపై అసత్య ప్రచారాలు చేస్తూ... భయాందోళనలకు గురిచేస్తున్నారని ఆ శాఖ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో రెవెన్యూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన అసంబద్ధ పథకాలు విఫలం కావటం వల్ల తమను బూచికి చూపుతున్నారని ఆరోపించారు. వందల ఏళ్లుగా ఉన్న శాఖను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టిన రాత్రింబవళ్లు కష్టపడి విజయవంతం చేశామన్నారు. ధరణి వెబ్‌సైట్‌లో ఉన్న లోపాలను సాకుగా చూపి తమకు అస్తిత్వం లేకుండా చేయాలనుకోవటం దారుణమని మండిపడ్డారు.

రౌండ్‌ టేబుల్‌ సమావేశం

ABOUT THE AUTHOR

...view details