'రెవెన్యూ శాఖను ఇతర శాఖల్లో విలీనం చేయొద్దు' - nirasana
ఖమ్మం జిల్లా ఏన్కూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్వోలు ధర్నా చేపట్టారు. రెవెన్యూ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులను ఇతర శాఖల్లో విలీనం చేయాలనుకుంటున్న ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలని కోరారు.
!['రెవెన్యూ శాఖను ఇతర శాఖల్లో విలీనం చేయొద్దు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4479816-172-4479816-1568808288059.jpg)
'రెవెన్యూ శాఖను ఇతర శాఖల్లో విలీనం చేయొద్దు'
రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర శాఖలో కలపాలనే ఆలోచన విరమించుకోవాలని ఖమ్మం జిల్లా ఏన్కూర్‌లో వీఆర్ఓలు నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. రైతులకు అండగా ఉంటూ పథకాల అమలులో కీలకంగా వ్యవహరిస్తున్న వీఆర్వోలను వివిధ శాఖల్లో కలపాలనే ఆలోచన విరమించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరసన దీక్షలో వివిధ పార్టీల నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
'రెవెన్యూ శాఖను ఇతర శాఖల్లో విలీనం చేయొద్దు'
TAGGED:
nirasana