ఖమ్మం మాతా శిశు ఆసుపత్రిలో నిలిచిపోయిన ప్రసూతి సేవలపై.. 'అవార్డులు దక్కించుకున్న ఆసుపత్రి.. ప్రసవం చేయలేకపోతోంది..!' అనే శీర్షికతో ఈటీవీ భారత్‌లో ప్రచురితమైన కథనంపై జిల్లా పాలనాధికారి ఆర్.వి.కర్ణన్ స్పందించారు. ఆసుపత్రిలో ప్రసూతి సేవలు నిలిచిపోకుండా నియామకాలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రసూతి సేవలు నిలిచిపోకుండా ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులను డిప్యుటేషన్‌పై నియమించిన కలెక్టర్.. వైద్యుల నియామకం కోసం సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించాలని సూచించారు.