తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు - mla mecha nageshwara rao in republic daycelebrations

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఆవిష్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా గణంతంత్ర వేడుకలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా గణంతంత్ర వేడుకలు

By

Published : Jan 26, 2020, 6:51 PM IST

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాములు నాయక్‌ జెండా ఆవిష్కరించారు. కొణిజర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు 300 మీటర్ల మువ్వెన్నల జెండాతో ప్రదర్శన నిర్వహించారు. ఏన్కూరు మండలం తిమ్మారావుపేటలో ముస్లింలు చిన్నారులతో దేశభక్తి గీతాలు ఆలపిస్తూ... ర్యాలీ నిర్వహించారు. వివిధ పాఠశాల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో గణంత్రంత వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మెచ్చా నాగేశ్వరరావు పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. కొత్తగూడెం ప్రకాశం మైదానంలో సింగరేణి ఆధ్వర్యంలో గణంతంత్ర వేడుకలు వైభవంగా నిర్వహించారు. సింగరేణి డైరెక్టర్ శంకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది, ఎన్‌సీసీ, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా గణంతంత్ర వేడుకలు

ఇదీ చూడండి: ఈటీవీ భారత్​కు ఓటరు అవగాహన అవార్డు!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details