కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి.. ఓ ప్రైవేటు కేసులో ఖమ్మం కోర్టుకు హాజరయ్యారు. 2018లో ఖమ్మం రెండో అదనపు కోర్టులో భూక్యా కళావతి అనే మహిళ వేసిన ప్రైవేటు కేసుకు సంబంధించి ఆగస్టులో రేణుకా చౌదరికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈరోజు వారెంటును రద్దు చేశారు. చట్టం పట్ల గౌరవం ఉందని సమన్లు అందలేదని ఆమె తరఫు న్యాయవాదులు.. న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. వచ్చెనెల 17న కేసు విచారణకు హజరుకానున్నట్లు న్యాయవాదులు తెలిపారు. తన భర్త వద్ద రేణుకాచౌదరి 2014 ఎన్నికల సమయంలో వైరా నుంచి టికెట్టు ఇప్పిస్తానని రూ. కోటి రూపాయలు తీసుకున్నట్లు ఆరోపిస్తూ.. కళావాతి ప్రైవేటు కేసు వేశారు.
ఖమ్మం కోర్టుకు హాజరైన రేణుకా చౌదరి - Renuka Chowdhury
ఓ ప్రైవేటు కేసులో ఖమ్మం కోర్టుకు హాజరయ్యారు కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి. 2018లో ఖమ్మం రెండవ అదనపు కోర్టులో భూక్యా కళావతి అనే మహిళ వేసిన ప్రైవేటు కేసుకు సంబంధించి ఆగస్టులో రేణుకా చౌదరికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.
కోర్టుకు హాజరైన రేణుకా చౌదరి