28 మంది ఇంటర్ విద్యార్థులను కేసీఆర్ ప్రభుత్వం పోట్టన పెట్టుకుందని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి ఆరోపించారు. కనీసం వారి కుటుంబాలను కలిసే సమయం ముఖ్యమంత్రికి లేదా అని ప్రశ్నించారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి రాదని తెలిసి మూడో కూటమి అంటూ కేసీఆర్ బయలుదేరారని ఎద్దేవా చేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఓడిపోతారని తెలిసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. ఖమ్మం జిల్లా జడ్పీ పీఠం కాంగ్రెస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు.
విద్యార్థుల ప్రాణాలంటే లెక్క లేదా?: రేణుక చౌదరి - Renuka chowdary fires on KCR
రాష్ట్రంలో 28 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్ స్పందించకపోవటం శోచనీయమని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి విమర్శించారు. బాధిత కుంటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
![విద్యార్థుల ప్రాణాలంటే లెక్క లేదా?: రేణుక చౌదరి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3236458-820-3236458-1557415617153.jpg)
విద్యార్థుల ప్రాణాలంటే లెక్క లేదా?: రేణుక చౌదరి
విద్యార్థుల ప్రాణాలంటే లెక్క లేదా?: రేణుక చౌదరి
ఇవీ చూడండి: 'కోవర్టులను బైటకు పంపకపోతే హస్తం మనుగడ కష్టం'
TAGGED:
Renuka chowdary fires on KCR