తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస దాడులకు భయపడం: రేణుకా చౌదరి - ఖమ్మంలో రేణుక చౌదరి ధర్నా

ఖమ్మంలో తెరాస పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని రేణుకా చౌదరి విమర్శించారు. ప్రభుత్వ అధికారులు గులాబీ నేతలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బస్టాండ్ కూడలిలో రాస్తారోకోను నిర్వహించారు.

ఖమ్మంలో రేణుక చౌదరి ధర్నా

By

Published : Apr 9, 2019, 12:01 AM IST

దిల్లీ నుంచి వచ్చిన తమ పార్టీ పరిశీలకులు బస చేసిన హోటల్ గదుల్లో వారు లేని సమయంలో సోదాలు చేయటం ఎంతవరకు సమంజసమని ఖమ్మం లోక్​సభ అభ్యర్థి రేణుకా చౌదరి ప్రశ్నించారు. గులాబీ నేతలు విచ్చల విడిగా నగదు పంపిణీ చేస్తున్న అధికారులు పట్టించుకోవటంలేదని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన మహిళల గదుల్లోకి వెళ్లి తనిఖీలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఖమ్మంలో రేణుకా చౌదరి ధర్నా

ABOUT THE AUTHOR

...view details