ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతపల్లి చెరువు నుంచి బేతపల్లి ప్రత్యామ్నాయ కాలువకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నీటిని విడుదల చేశారు. సత్తుపల్లి మండలంలో ఆరు చెరువులు, వేంసూరు మండలంలోని 42 చెరువులకు నీటిని తరలించి సుమారు ఎనిమిది వేల ఎకరాల సాగుకు నీటిని అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష మేరకు సీతారామ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే అన్నారు.
బేతపల్లి చెరువు నుంచి నీటి విడుదల - ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బేతపల్లి చెరువు నుంచి నీటిని విడుదల చేశారు. వీటి ద్వారా ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.
నీటి విడుదల