ఖరీఫ్ సీజన్‌కు పత్తి సాగులో అంతర పంటగా కంది సాగు చేయాలని.. ఈసారి కంది పంటను కూడా ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసిందని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో కారం, చిన్న కోరుకొండి గ్రామాల్లో వానాకాలం పంటలపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరయ్యారు.
కల్లూరు మండలంలో సన్న రకం పంటలను ఎక్కువ ఎకరాల్లో సాగు చేయాలని.. లావు రకం తక్కువ ఎకరాల్లో సాగు చేయాలని కలెక్టర్ సూచించారు. యాసంగి సాగుకు ముందే సత్తుపల్లి నియోజకవర్గంలో రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు. పత్తి పంటలో గులాబీ పురుగులు రాకుండా వేప నూనెను ఎక్కువగా వినియోగించాలని రైతులకు వివరించారు.