వలస కూలీల పట్ల దాతలు చూపిస్తున్న ఔదార్యం ప్రశంసనీయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రెడ్డిగూడెంలో 200 మంది వలస కూలీలకు దాతలు అందించిన బియ్యం, నిత్యావసర సరుకులు ఆయన పంపిణీ చేశారు. గ్రామస్థుల విరాళాలతో సర్పంచి బద్దం నిర్మల సహకారంతో కూలీలను ఆదుకోవడం అభినందనీయమని తెలిపారు.
గ్రామస్థుల విరాళాలు.. కూలీలకు నిత్యావసర సరుకులు - గ్రామస్థుల విరాళాలు.. కూలీలకు నిత్యావసర సరుకులు
గ్రామస్థులందరి దగ్గర నుంచి విరాళాలు సేకరించి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేతుల మీదుగా మొత్తం 200 మంది వలస కూలీలకు నిత్యావసర సరుకులు అందజేశారు ఖమ్మం జిల్లా రెడ్డిగూడెం ప్రజలు.
గ్రామస్థుల విరాళాలు.. కూలీలకు నిత్యావసర సరుకులు
రాష్ట్ర ప్రభుత్వం వలస కూలీలకు ప్రత్యేక వసతులు కల్పిస్తుందని, బియ్యం, నగదు అందించిందన్నారు. లాక్‌డౌన్ ముగిసే వరకు కూలీలు తమ నివాసాల్లోనే ఉండాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు వారిని పర్యవేక్షిస్తూ... ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే సండ్ర సూచించారు.
ఇవీ చూడండి:లాక్‌డౌన్ వేళ 'కరోనా విందు'- ఒకరు అరెస్ట్