వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పాతపద్ధతిలోనే చేపట్టాలంటూ స్థిరాస్తి వ్యాపారులు ఆందోళన నిర్వహించారు. ఖమ్మం జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నిరసనగా ప్లకార్డులు ప్రదర్శించారు.
'ఎల్ఆర్ఎస్ రద్దు చేసి పాత పద్ధతినే కొనసాగించండి' - ఖమ్మం జిల్లా వార్తలు
ఎల్ఆర్ఎస్ను రద్దు చేసి, పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగించాలంటూ స్థిరాస్తి వ్యాపారులు ధర్నా నిర్వహించారు. ఖమ్మం జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు పెద్దఎత్తున నినాదాలు చేశారు.

'ఎల్ఆర్ఎస్ రద్దు చేసి పాత పద్ధతినే కొనసాగించండి'
ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. నాలుగు నెలలుగా భూముల క్రయ, విక్రయాలు నిలిచిపోయి నష్టపోయామని స్థిరాస్తి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.