ముస్లింల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఖమ్మం ఎంపీ నామానాగేశ్వరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని గొల్లగూడెం ఈద్గా నమాజ్‌లో పాల్గొన్నారు. మత పెద్దలు రంజాన్ విశిష్టతను వివరించగా... ముస్లింలు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఖమ్మం ఎంపీ నామా, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపారావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌తో పాటు పలువురు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ప్రార్థనల్లో హిందూ, ముస్లింలు కలిసి పాల్గొనడం వల్ల ఐకమత్యం పెరుగుతుందని ఎంపీ పేర్కొన్నారు.
హిందు, ముస్లిం కలిసుంటే ఐకమత్యం పెరుగుతుంది: నామా - eid
హిందు, ముస్లింలు కలిసుంటే ఐకమత్యం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు. రంజాన్ పండుగ సందర్భందగా ఆయన ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
![హిందు, ముస్లిం కలిసుంటే ఐకమత్యం పెరుగుతుంది: నామా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3479760-thumbnail-3x2-nfj.jpg)
రంజాన్ ప్రార్థనలు