తెలంగాణ మొదటి వాగ్గేయకారుడు, భద్రాచల శ్రీ సీతారామచంద్ర ఆలయ నిర్మాణ కర్త భక్త రామదాసు జయంతి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ భాషా సాంస్రృతిక శాఖ, భక్త రామదాసు విద్యాపీఠం, భద్రాద్రి రామాలయ మండలి సంయుక్తంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి.
రెండోరోజు.. రామదాసు ఉత్సవాలు - భక్త రామదాసు జయంతి
భక్త రామదాసు జయంతుత్సవాలు రెండోరోజు ఘనంగా కొనసాగాయి. భక్తుల కరతాళ ధ్వనుల మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
![రెండోరోజు.. రామదాసు ఉత్సవాలు ramadasu-jayanthi-celebrations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5907584-331-5907584-1580461674584.jpg)
రెండోరోజు.. రామదాసు ఉత్సవాలు
ఖమ్మం జిల్లా పాలేరు నియోజక వర్గంలోని నేలకొండపల్లిలో రెండోరోజు రామదాసు జయంతి ఉత్సవాలు కొనసాగాయి. విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, అన్నమాచార్య సంగీత నృత్య కళాశాల విద్యార్థుల నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఉదయం విద్యార్థుల చేత చేయించిన నగర కీర్తనకు మంచి స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా.. జిల్లా సీఈవో ప్రియాంక వర్ణన్ పాల్గొన్నారు.