తెలంగాణ

telangana

ETV Bharat / state

'విద్యాసంస్థల పునఃప్రారంభానికి నిర్ణయం తీసుకోవాలి' - ఖమ్మంలో ర్యాలీ వార్తలు

కరోనాతో మూతపడిన విద్యాసంస్థల్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ.. ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సినిమాహాళ్లు, రెస్టారెంట్లు తదితర వాటికి అనుమతించిన ప్రభుత్వం.. పాఠశాలలు, కళాశాలలకు ఎందుకు ఇవ్వడం లేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నించారు. పునఃప్రారంభానికి వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

khammam, rally in khammam, reopening of schools
ఖమ్మం, ర్యాలీ, విద్యాసంస్థలు, ఖమ్మంలో ర్యాలీ

By

Published : Jan 7, 2021, 12:43 PM IST

కరోనా కారణంగా మూతపడిన విద్యాసంస్థల్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ.. ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు, పలు విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.

రిక్కా బజార్ పాఠశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. లాక్​డౌన్ సమయంలో మూతపడిన సినిమాహాళ్లు, రెస్టారెంట్లు, ఇతర షాపింగ్ మాల్స్ అన్నింటినీ తెరిచేందుకు అనుమతిచ్చిన ప్రభుత్వం.. విద్యాసంస్థలు తెరిచేందుకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమని నేతలు అన్నారు. వెంటనే రాష్ట్రంలో విద్యాసంస్థల పునఃప్రారంభానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:ఆఫీసు స్థలానికి పెరిగిన గిరాకీ.. కోలుకుంటోన్న రియల్ ఎస్టేట్

ABOUT THE AUTHOR

...view details