కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ వ్యవసాయ బిల్లులతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని సీపీఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ ఆరోపించారు. వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ ఖమ్మం జిల్లా ఏన్కూర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల ప్రదర్శన నిర్వహించారు.
వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. సీపీఎం నిరసన
వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ ఖమ్మం జిల్లా ఏన్కూర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల ప్రదర్శన నిర్వహించారు. మోదీ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 1965కు ముందు అమలు చేసిన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభిస్తుందని ఆరోపించారు. 55 ఏళ్ల క్రితం రైతులకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆరోపణతో రద్దు చేసిన చట్టాలను తిరిగి అమలు చేసే ప్రక్రియ చేపడుతున్నారని విమర్శించారు. రైతులకు నష్టం కలిగించే చట్టాలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 26న దేశ రాజధాని దిల్లీలో కార్మిక కర్షక సంఘాలు చేపట్టనున్న ఆందోళన జయప్రదం చేయాలని కోరారు.