ఖమ్మం జిల్లా మధిరలో కుండపోత వర్షానికి ఇళ్లలోకి వరదనీరు చేరింది. మధిర ప్రభుత్వ ఆస్పత్రిలోకి మోకాలి లోతు వరద నీరు చేరింది. ప్రసూతి వార్డులోకి కూడా పెద్ద ఎత్తున నీరు చేరటంతో బాలింతలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే శిథిలావస్థకు చేరిన ఈ ఆస్పత్రి భవనంలో.... ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి రోగులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
మధిర ప్రభుత్వాసుపత్రిలోకి మోకాలి లోతు వరద నీరు.. ఇదిగో వీడియో... - Rains in Khammam District
ఎడతెరిపిలేకుండా లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పల్లెలు, పట్టణాలు తడిసి ముద్దవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా రాత్రి నుంచి జోరు వానలు కురుస్తున్నాయి. మధిర ప్రభుత్వ ఆస్పత్రిలోకి లోతు వరద నీరు చేరింది. వర్షానికి రోగులు నానా అవస్థలు పడుతున్నారు.
మధిర ప్రభుత్వాసుపత్రిలోకి మోకాలి లోతు వరద నీరు.. ఇదిగో వీడియో...