తెలంగాణ

telangana

ETV Bharat / state

Puvvada vs Tummala in Khammam : సమఉజ్జీల సమరం.. ఖమ్మంలో కాకరేపుతున్న పువ్వాడ వర్సెస్ తుమ్మల రాజకీయం

Puvvada vs Tummala in Khammam : సమఉజ్జీల సమరంతో ఖమ్మం పోరు రసకందాయంలో పడుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి పువ్వాడ అజయ్ మూడోసారి బరిలోకి దిగుతుండగా.. అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి తుమ్మల పోటీ చేస్తు‌న్నారు. ఉద్దండుల పోరుతో నామినేషన్ల పర్వానికి ముందే.. రాజకీయ సమరానికి తెరలేచింది. ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు పువ్వాడ-తుమ్మల వేస్తున్న ఎత్తులకు పైఎత్తులతో రాజకీయ యుద్ధానికి ఖమ్మం వేదికైంది. ప్రచారపర్వానికి పూర్తి స్థాయిలో తెరలేవక ముందే నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సామాజికవర్గాల వారీగా మద్దతు కోసం ఇద్దరు నాయకులు ఆత్మీయ సమ్మేళనాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు.

Puvvada vs Tummala in Khammam
Puvvada vs Tummala

By ETV Bharat Telangana Team

Published : Oct 22, 2023, 9:40 AM IST

Puvvada vs Tummala in Khammam ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఖమ్మంలో రాజకీయ కాక

Puvvada vs Tummala in Khammam : రెండోసారి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. తుమ్మల నాగేశ్వరరావు మధ్య సమరంతో ఖమ్మంలో రాజకీయం రసవత్తరంగా మారింది. 2014లో తొలిసారి ఈ ఇద్దరు నేతలు ఖమ్మం బరిలో నిలిచారు. టీడీపీ నుంచి తుమ్మల బరిలో నిలవగా.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పువ్వాడ అజయ్ పోటీకి దిగారు. ఆ ఎన్నికల్లో తుమ్మలపై.. అజయ్ పైచేయి సాధించి విజయ బావుటా ఎగురవేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో నేతలిద్దరూ ఒకే గూటికి చేరారు.

2018 ఎన్నికల్లో పువ్వాడ అజయ్(Puvvada Ajay Kumar).. రెండోసారి ఖమ్మం నుంచి బరిలో నిలిచి గెలవగా.. ఆ ఎన్నికల్లో పాలేరు నుంచి బరిలోకి దిగిన తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. తాజాగా మళ్లీ ఇద్దరు ఉద్దండులు ఖమ్మంలో ప్రత్యర్థులుగా సై అంటే సై అంటుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. పువ్వాడ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిత్వం అధికారికంగా ఖరారు కాకున్నా.. తుమ్మల తనదైన శైలిలో రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతున్నారు.

Minister Puvvada Fires on Congress : 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఎప్పుడైనా 'ప్రజల బీమా' గురించి ఆలోచించిందా..?

Political Heat in Khammam District : బీఆర్ఎస్ నుంచి మరోసారి ఖమ్మంలో బరిలో నిలుస్తున్న మంత్రి పువ్వాడ అజయ్.. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలతో నియోజకవర్గంలో ఓ విడత ప్రచారం పూర్తి చేశారు. ప్రత్యర్థులకు ఎక్కడా అవకాశం లేకుండా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్న ఆయన.. మరో దఫా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలో బరిలోకి దిగడం ఖాయమనే సంకేతాలతోతుమ్మల (Tummala Nageswara Rao) ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నారు. భారత్ రాష్ట్ర సమితికి చెందిన మాజీ ఎమ్మెల్సీ బాలసాని, ముగ్గురు కార్పొరేటర్లు, ఆ తర్వాత రఘునాథపాలెం ఎంపీపీని కాంగ్రెస్‌లో చేర్చుకొని అధికార పార్టీకి ఝలక్ ఇచ్చారు.

Telangana Assembly Elections 2023 : గతంలో తనతో కలిసి పని చేసిన నాయకులు, సామాజికవర్గాలకు చెందిన నేతల ఇళ్లకు తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా వెళ్తూ మద్దతు కూడగడుతున్నారు. సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొని ఎన్నికల్లో మద్దతు కోరుతున్నారు. ఖమ్మంలో బలమైన కమ్మ సామాజిక వర్గంలో పైచేయి సాధించేందుకు ఇద్దరు నేతలు పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం కమ్మ మహాజన సంఘం కార్యదర్శి, టీడీపీ నేత తాళ్లూరి జీవన్ మంత్రి పువ్వాడ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఖమ్మం కమ్మ మహాజన సంఘం అధ్యక్షుడు ఎర్నేని రామారావు తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

"నేను బీ ఫామ్ తీసుకునేందుకు హైదరాబాద్ వెళ్తే.. ఖమ్మంలో కొందరు బందిపోటు దొంగలు చొరబడ్డారు. దమ్ముంటే నేను ఖమ్మంలో ఉన్నప్పుడు వస్తే.. వారికి సినిమా చూపించేవాణ్ని. రాబోయే ఎన్నికల్లో తుమ్మలను ఓడించి తీరుతాను." - పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి

"నేను ఉన్న ఐదు సంవత్సరాలు మంచి నీళ్లు, వంతెనలు, రోడ్లు కావాలని అడుగుతారు. కానీ ఇప్పుడేమో మా పోలీసు కేసులు తీసి వేయండని అడుగుతున్నారు. ఇంత అహంకారమైన, బెదిరింపు రాజకీయాలు ఎక్కడా చూడలేదు." - తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నేత

Political Heat in Khammam District : రసవత్తరంగా ఖమ్మం రాజకీయం.. నువ్వానేనా అంటూ బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ ఢీ

Telangana Election Campaign 2023 : క్షేత్రస్థాయిలో ప్రచారపర్వానికి(Election Campaign) మరింత ఊపందుకోకముందే ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే అజెండాగా ప్రజల్లోకి వెళ్తున్న తాను మరోసారి తుమ్మలను ఓడిస్తానని.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధీమాగా చెబుతున్నారు. ఖమ్మం అభివృద్ధికి తానే పునాదులు వేశానని చెప్పుకుంటూనే తుమ్మల.. పువ్వాడ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ఇద్దరు నేతల మధ్య పోరుతో రాష్ట్రంలోనే ఖమ్మం రాజకీయంగా ప్రత్యేకతను సంతరించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Political Heat in Khammam District : ఖమ్మంలో రాజుకుంటున్న రాజకీయం... ప్రచారాలు ప్రారంభించిన నేతలు

Minister Puvvada Fires on Congress : 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఎప్పుడైనా 'ప్రజల బీమా' గురించి ఆలోచించిందా..?

ABOUT THE AUTHOR

...view details