రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లా వైరా పురపాలికను మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రాములు నాయక్ తెలిపారు. అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా 80 లక్షలతో నిర్మించిన ప్రజా శౌచాలయాలను ఆయన ప్రారంభించారు.
'వైరా పురపాలికను ఆదర్శంగా తీర్చిదిద్దుతా' - ఖమ్మం తాజా వార్తలు
ఖమ్మం జిల్లా వైరా పురపాలికను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా 80 లక్షలతో నిర్మించిన ప్రజా శౌచాలయాలను ఆయన ప్రారంభించారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.
'వైరా పురపాలికను ఆదర్శంగా తీర్చిదిద్దుతా'
ఇప్పటికే 20 కోట్ల రూపాయలతో రహదారులను అభివృద్ధి చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతితో పురపాలికల్లో పార్కుల నిర్మాణం చేపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్నేహలత, పురపాలక ఛైర్మన్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు.