తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇష్టం లేకపోతే ఉద్యోగం వదలిపెట్టి వెళ్లిపోండి.. ఉద్యోగికి ప్రజాప్రతినిధుల వార్నింగ్ - telangana news

Public Representatives Warning To Officer: కామేపల్లి మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. రహదారి నిర్మాణం నాణ్యత సరిగా లేదని ప్రజా ప్రతినిధులు ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం లేకపోతే ఉద్యోగం వదిలిపెట్టి వెళ్లిపోవాలని మండిపడ్డారు. స్పందించిన అధికారి వెళ్లిపోతాను అని చెప్పాడు.

ఇష్టం లేకపోతే ఉద్యోగం వదలిపెట్టి వెళ్లిపోండి.. ఉద్యోగిని నిలదీసిన ప్రజాప్రతినిధులు
ఇష్టం లేకపోతే ఉద్యోగం వదలిపెట్టి వెళ్లిపోండి.. ఉద్యోగిని నిలదీసిన ప్రజాప్రతినిధులు

By

Published : Mar 16, 2022, 6:56 PM IST

Public Representatives Warning To Officer: ఖమ్మం జిల్లా కామేపల్లి మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా కొనసాగింది. రామకృష్ణాపురం గ్రామపంచాయతీలో కోటి 75 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న రహదారి నిర్మాణం నాణ్యత సరిగా లేదని ప్రజా ప్రతినిధులు ఏఈ వరప్రసాద్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులకు సంబంధించిన వివరాలు ప్రజాప్రతినిధులకు తెలపడం లేదని ఎంపీపీ సునీత, జడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ ఆ ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేసి.. ఇష్టం లేకపోతే ఉద్యోగం వదిలిపెట్టి వెళ్లిపోవాలని మండిపడ్డారు. ఇష్టముంటే పనిచేయాలని లేకుంటే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనికి స్పందించిన అధికారి వెళ్లిపోతాను అని చెప్పాడు. అనంతరం మళ్లీ తన తప్పుంటే వెళ్లిపోతానని ఆ అధికారి చెప్పాడు. ప్రజాప్రతినిధులకు పనుల గురించి చెప్పకపోవడం తప్పేనని అంగీకరించిన ఏఈ వరప్రసాద్​.. వారికి క్షమాపణలు తెలిపారు. పనులకు సంబంధించి గుత్తేదారు ప్రజాప్రతినిధులకు సమాచారం ఇస్తానని చెప్పాడని.. అందువల్లే తాను చెప్పలేదని ఏఈ తెలిపారు. ఈ నేపథ్యంలో గుత్తేదారులతో ప్రజాప్రతినిధులకు ఏం సంబంధం అంటూ ఎంపీపీ సునీత, జడ్పీటీసీ ప్రవీణ్ కుమార్, పలువురు సర్పంచ్​లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేకుండా కల్వర్టులు నిర్మిస్తున్నారని ప్రజాప్రతినిధులు ఆరోపించారు.

ఉద్యోగిని నిలదీసిన ప్రజాప్రతినిధులు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details