ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కొవిడ్-19 విధుల్లో పనిచేస్తున్న పురపాలక పారిశుధ్య కార్మికులు, పోలీసులు, వైద్య సిబ్బందికి భోజనాలు పెట్టారు. రింగ్‌రోడ్ కూడలి, పురపాలక కార్యాలయం వద్ద వాహనదారులు, బాటసారులకు కరోనాపై అవగాహన కల్పించారు.
విధుల్లోని ఉద్యోగులకు ఉపాధ్యాయులు ఆహారం అందజేత
పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. విధుల్లో ఉన్న వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులకు భోజనాలు ఏర్పాటు చేసి సేవా గుణాన్ని చాటుకున్నారు.
విధుల్లోని ఉద్యోగులకు ఉపాధ్యాయులు ఆహారం అందజేత
లాక్‌డౌన్‌ను నిబంధనలు పాటించి.. అధికారులకు సహకరించాలంటూ చైతన్యం కల్పించారు. పలువురు ఉపాధ్యాయులు కరోనా వేషధారణతో అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే రాములునాయక్, మార్క్ ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, పురపాలక ఛైర్మన్ సూతకాని జైపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:శిక్షించడంలోనే కాదు... ఆదుకోవడంలోనూ మాకు మేమే సాటి