పెనుబల్లి వైద్యశాలకు ఎంతో ఉపయోగకరమైన మూడు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను (oxygen concentrators) అందించి… కరోనా రోగుల పట్ల దాతృత్వం చూపిస్తున్న దాతలకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి వైద్యశాలకు అమెరికాకు చెందిన ఈ సంస్థ విస్తరణతో మూడు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను వైద్యశాల సూపరిండెంట్ రమేష్‌కు ఎమ్మెల్యే అందజేశారు. కరోనా బారినపడి ఆసుపత్రికి వచ్చే వారికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఎంతగానో ఉపకరిస్తాయని తెలిపారు. తన బాల్యమిత్రుడు చిరాక్ ఫౌండేషన్ బెల్లం మధు, గుర్రం జ్యోతి సహకారంతో ఇప్పటికే సత్తుపల్లి వైద్యశాలకు 10 కాన్సంట్రేటర్లను అందజేయడంతో పాటు.. ప్రస్తుతం పెనుబల్లి వైద్యశాలకు 3 అందించామన్నారు.
పెనుబల్లి వైద్యశాలకు మూడు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల అందజేత
ఖమ్మం జిల్లా పెనుబల్లి వైద్యశాలకు దాతల ఆధ్వర్యంలో మూడు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను (oxygen concentrators) సండ్ర వెంకట వీరయ్య అందజేశారు. కరోనా బారినపడి ఆసుపత్రికి వచ్చే వారికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఎంతగానో ఉపకరిస్తాయని తెలిపారు. కష్ట సమయంలో దాతలు చేస్తున్న కృషిని అభినందించారు.
సత్తుపల్లి నియోజకవర్గం ఆంధ్రా ప్రాంతానికి ఆనుకొని ఉండటంతో కరోనా కేసులు తీవ్రంగా ఉన్నాయన్నారు. నియోజకవర్గంలోని ప్రజల కోసం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో 50 ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వారికి రెండు పూటలా భోజనం, టిఫిన్, మినరల్ వాటర్ అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు పాటించి కరోనా నియంత్రణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు భుక్యా పంతులి, తావునాయక్ , సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మన్ మహేష్, పశు వైద్య శాఖ ఏడీ ప్రదీప్ కుమార్, సర్పంచ్ల సంఘం అధ్యక్షులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఇది చూడండి: Telangana Cabinet: ఎల్లుండి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం