అధ్వానంగా ఉన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. ఖమ్మం జిల్లా వైరా, మధిర రహదారిలో ముఖానికి మాస్కులు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. గుంతలమయమైన రోడ్ల వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణలో గుంతల రోడ్లు సిగ్గుచేటు అంటూ నినాదాలు చేశారు. తక్షణమే మరమ్మతులు చేయాలని కోరారు.
రోడ్లకు మరమ్మతులు చేయాలంటూ వినూత్న నిరసన - రోడ్లకు మరమ్మతులు చేయాలంటూ ఖమ్మం సీపీఎం నేతల ఆధ్వర్యంలో నిరసన
రహదారులకు మరమ్మతులు చేపట్టాలంటూ ఖమ్మం జిల్లలో సీపీఎం ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. వైరా మధిర రోడ్డులో నోటికి మాస్కులు కట్టుకుని ఆందోళన తెలిపారు.
రోడ్లకు మరమ్మతులు చేయాలంటూ వినూత్న నిరసన